రెండు సార్లు డకౌట్‌.. ఇది కాదా స్థిరత్వం! | Shikhar Dhawan gets trolled for sharing batting practice video after getting out on golden duck against Essex | Sakshi
Sakshi News home page

రెండు సార్లు డకౌట్‌.. ఇది కాదా స్థిరత్వం!

Published Sat, Jul 28 2018 4:08 PM | Last Updated on Sat, Jul 28 2018 4:17 PM

Shikhar Dhawan gets trolled for sharing batting practice video after getting out on golden duck against Essex - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఎసెక్స్‌ జట్టుతో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌గా నిష్క్రమించడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సన్నాహక మ్యాచ్‌లోనే ఇలా ఆడితే ఇక అసలు టెస్టు సిరీస్‌లో ఎలా ఆడతాడో అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు.  అదే సమయంలో ఒక ప్రాక్టీస్‌ వీడియోను ధావన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం నెటిజన్లకు మరింత కోపాన్ని తెప్పించింది.

‘ధావన్‌ మరోసారి డకౌట్‌ అయ్యాడు.. ఇక రాహుల్‌, విజయ్‌ను టెస్టుల్లో ఆడించడమే ఉత్తమం’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట అంటే ధావన్‌కు ఎంతో ఇష్టం అనుకుంట. అందుకే రెండు ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే ఔటయ్యాడు.  ‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఓపెనింగ్‌ సమస్యపై బెంగ తీరింది’ అని మరొక​ అభిమాని సెటైర్‌ వేయగా, ‘ తొలి ఇన్నింగ్స్‌-0(1), సెకండ్‌ ఇన్నింగ్స్‌-0(3)..  ఇది కాదా ధావన్‌ స్థిరమైన బ్యాటింగ్‌కు నిదర్శనం’ అని మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ధావన్‌.. నువ్వు బంతిని నెట్స్‌లో మాత్రమే బాదగలవు’ అని ఒక అభిమాని చమత్కరించాడు. ఇలా ధావన్‌పై సోషల్‌ మీడియాలో మాటల దాడి కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement