బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జేమ్స్ అండర్సన్ వేసిన నాల్గో ఓవర్ రెండో బంతిని గుడ్ లెంగ్త్‌లో సంధించాడు. తొలుత ధావన్ బ్యాట్‌ను తాకిన ఆ బంతి ప్యాడ్లపై జారుకుంటూ కింద పడింది. అయితే డేంజర్ జోన్‌లో పడిన సదరు బంతి వికెట్లపైకి సమీపిస్తుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ధావన్.. చాకచక్యంగా వ్యవహరించి బ్యాట్‌తో పక్కకు గెంటేశాడు. దాంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ అప్పుడే ఔటై ఉంటే మాత్రం తన ఎంపికను ప్రశ్నిస్తున్నవారి నోటికి మరింత పని కల్పించేవాడు ధావన్.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 287 పరుగుల వద్ద ఆలౌటైంది. 285/9 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్ ఆటగాడు స్యామ్ కరన్(24) చివరి వికెట్‌గా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ ఆఖరి వికెట్‌ను మహ్మద్ షమీ సాధించాడు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, షమీ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలకు తలోవికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment