నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో మన పేసర్లు చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. భారత బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా... మొహమ్మద్ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (9 నాటౌట్), కేఎల్ రాహుల్ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆరంభంలో కొంత తడబడినా...ఒక దశలో 138/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. రూట్, బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే బెయిర్‌స్టోను షమీ అవుట్ చేయడంతో మొదలైన ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది.
45 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోవడం విశేషం. భారత్ తమ తుది జట్టు ఎంపికలో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఒకే స్పిన్నర్‌ను జడేజాను తీసుకొని చక్కటి ఫామ్‌లో ఉన్న, ప్రాక్టీస్ కోసం కౌంటీ మ్యాచ్‌లో కూడా ఆడిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను పక్కన పెట్టింది. అతని స్థానంలో నాలుగో పేసర్‌గా, బ్యాటింగ్ కూడా చేయగల నైపుణ్యం ఉన్న శార్దుల్ ఠాకూర్‌ను ఎంచుకుంది. మరోవైపు సీనియర్ ఇషాంత్ ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో సిరాజ్‌కు చోటు దక్కింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (సి) ఎల్బీ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) రాహుల్ (బి) షమీ 18; క్రాలీ (సి) పంత్ (బి) సిరాజ్ 27; రూట్ (ఎల్బీ) (బి) శార్దుల్ 64; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) షమీ 29; లారెన్స్ (సి) పంత్ (బి) షమీ 0; బట్లర్ (సి) పంత్ (బి) బుమ్రా 0; స్యామ్ కరన్ (నాటౌట్) 27; రాబిన్సన్ (సి) షమీ (బి) శార్దుల్ 0; బ్రాడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 4; అండర్సన్ (బి) బుమ్రా 1; ఎక్స్‌ట్రాలు 13, మొత్తం (65.4 ఓవర్లలో ఆలౌట్) 183.
వికెట్ల పతనం: 1–0, 2–42, 3–66, 4–138, 5–138, 6–145, 7–155, 8–155, 9–160, 10–183.
బౌలింగ్: బుమ్రా 20.4–4–46–4, షమీ 17–2–28–3, సిరాజ్ 12–2–48–1, శార్దుల్ 13–3–41–2, జడేజా 3–0–11–0.
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 9; రాహుల్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (13 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 21.
బౌలింగ్: అండర్సన్ 3–1–9–0, బ్రాడ్ 5–1–9–0, రాబిన్సన్ 4–3–1–0, స్యామ్ కరన్ 1–1–0–0.
Comments
Please login to add a commentAdd a comment