పూజ పసిడి గురి
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్
కువైట్: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్ పూజా ఘోట్కర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించిం ది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 413.1 స్కోరు నమోదు చేసి ఫైనల్‌కు చేరిన పూజ... 208.8 స్కోరుతో విజేతగా నిలిచింది. చైనా షూటర్లు దూ బెజ్ 207.2, యి సైలింగ్ 186.2తో వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
పూజ అద్భుత ప్రతిభకు తోడు అపూర్వి చందేలా, అయోనికా పాల్‌ల స్కోరు జత కలవడంతో టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. చైనా స్వర్ణం, సౌదీ అరేబియా కాంస్యం దక్కించుకున్నాయి. పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో భారత షూటర్లు సమరేశ్ జంగ్ 119.4తో 6వ, పి.ఎన్.ప్రకాశ్ 98.2తో 7వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. అయితే జట్టుగా జీతూ రాయ్‌తో కలిసి 1800కుగాను 1732 స్కోరుతో భారత్‌కు రజతం సాధించి పెట్టారు.