న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆశ‍్చర్యం వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యహరించిన రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన గంగూలీ.. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సంబంధించి జట్టు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోకపోవడాన్ని గంగూలీ ప్రశ్నించాడు. ప్రతీసారి టెస్టు జట్టును ఎంపిక చేసేటప్పుడు రోహిత్‌ను పరిగణలోకి తీసుకోకపోవడం ఒకింత ఆశ‍్చర్యానికి గురి చేస్తుందన్నాడు. ‘రోహిత్..నీ సారథ్యంలో ఆసియాకప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయినా వెస్టిండీస్ టెస్టుకు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో నీపేరు లేకపోవడం చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యా' అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు.
భారత టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), పుజారా, లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విహారి, రిషభ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్.
Great win Rohit and the team @ImRo45 ..u were exceptional...I get surprised every time I don’t see ur name in the test team ..it’s not far away ..
— Sourav Ganguly (@SGanguly99) 29 September 2018
Comments
Please login to add a commentAdd a comment