దుబాయ్: దక్షిణాఫ్రికా అండర్-19 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. శనవారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా ఆరు వికెట్లతో పాకిస్థాన్పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ గెలవడం ఇదే తొలిసారి.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్ 44.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. పాక్ జట్టులో అమద్ బట్ (37) టాప్ స్కోరర్. సౌతాఫ్రికా బౌలర్లు బోస్క్ నాలుగు, డిల్, వాల్లి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 42.1 ఓవర్లలో అలవోకగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ మక్రమ్ (66 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి విజయాన్నందించాడు. అతనికి ఓల్డ్ ఫీల్డ్ (40) అండగా నిలిచాడు.
అండర్-19 వరల్డ్ కప్ విజేత దక్షిణాఫ్రికా
Published Sat, Mar 1 2014 8:28 PM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM
Advertisement
Advertisement