దక్షిణాఫ్రికాదే తొలి టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 206 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో ప్రొటీస్ 1–0తో ఆధిక్యం సాధించింది. 488 పరుగుల భారీ లక్ష్యంతో 240/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను ఆరంభం నుంచే సఫారీ బౌలర్లు దెబ్బతీశారు.
మూడో ఓవర్‌లోనే అబాట్ నిలకడగా ఆడుతున్న కెప్టెన్ మ్యాథ్యూస్ (59; 7 ఫోర్లు)ను అవుట్ చేయడంతో పతనం ప్రారంభమైంది. కేవలం 41 పరుగుల్లోపే ఐదు వికెట్లను కోల్పోయిన లంక 281 పరుగులవద్ద ఆలౌటైంది. రబడా, మహరాజ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. అబాట్ రెండు వికెట్లు తీశాడు.