చితకొట్టిన డివిలియర్స్
జోహన్నస్ బర్గ్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 9వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బట్లర్ 54(24 బంతుల్లో,4 ఫోర్లు,4 సిక్సర్లు)పరుగుల సహాయంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 171 పరుగులు చేసి ఆలౌటయ్యింది.
అనంతరం 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. డివీలియర్స్ 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 26 బంతుల్లో 71 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించే క్రమంలోనే రషీద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఓపెనర్లుగా వచ్చిన డివీలియర్స్, ఆమ్లా(69 పరుగులు, 38 బంతులు)లు తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం డూప్లెసిస్, ఆమ్లాలు కూడా వేగంగా ఆడి ఇంకా 32 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు.