మెల్ బోర్న్ ముచ్చట్లు
హైదరాబాద్: మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో ఆదివారం వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఆతిథ్య జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా మెల్ బోర్న్ లో జరిగిన రికార్డులు ఓసారి చూద్దాం.
ఈ మైదానంలో..
ఇప్పటిదాకా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు 342. ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా చేసింది.
ఇక్కడ నమోదైన అత్యల్ప స్కోరు 94. ఆసీస్తో మ్యాచ్లో ఇంగ్లండ్ నమోదు చేసింది.
ఈ గ్రౌండ్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ షేన్ వార్న్ - 46 వికెట్లు పడగొట్టాడు.
ఇక్కడ అతి పెద్ ఛేజింగ్ 297 పరుగులు. ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆసీస్ నెలకొల్పింది.
ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్పై బెట్టింగ్ రాయుళ్లు భారీగా నమ్మకముంచారు.
ఆస్ట్రేలియా తరఫున స్టీవెన్ స్మిత్పై, కివీస్ కెప్టెన్ మెక్ కల్లమ్పై భారీగా బెట్టింగ్లు కాశారు.
అదే విధంగా డేవిడ్ వార్నర్, గప్టిల్ పైనా కొంత వరకు నమ్మకం ఉంచారు.
అయితే సెమీస్లో రాణించిన ఎలియట్ పై ఆశలు లేనట్టే కనిపిస్తున్నాయి.