సెమీస్‌లో శ్రీకాంత్ | Srikanth survives scare to seal place in last four of Syed Modi International Badminton Championships | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీకాంత్

Published Sat, Jan 30 2016 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

సెమీస్‌లో శ్రీకాంత్

సెమీస్‌లో శ్రీకాంత్

లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకోగా... నాలుగో సీడ్ పారుపల్లి కశ్యప్ (భారత్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ 21-17, 18-21, 24-22తో గో సూన్ హువాట్ (మలేసియా)పై కష్టపడి గెలుపొందగా... డిఫెండింగ్ చాంపియన్ కశ్యప్ 16-21, 21-18, 15-21తో ప్రపంచ 73వ ర్యాంకర్ యుజియాంగ్ హువాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.  
 
మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 23-21, 21-17తో సుపజిరాకుల్-సప్‌సిరి (థాయ్‌లాండ్) జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ (భారత్) జంట 22-20, 11-21, 23-21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న మాడ్స్ పీటర్సన్-మాడ్స్ పీలర్ (డెన్మార్క్) జోడీపై సంచలన విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement