
ఇపో (మలేసియా): గతేడాది నిరాశాజనక ఫలితాలను వెనక్కి నెట్టి కొత్త సీజన్‌ను ఆశావహంగా ప్రారంభించాలనే లక్ష్యంతో భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్ బరిలోకి దిగుతోంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఆతిథ్య మలేసియా, ఆసియా క్రీడల చాంపియన్ జపాన్, దక్షిణ కొరియా, కెనడా, పోలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. తొలి రోజు జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో భారత్ తలపడుతుంది. జపాన్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది. ఆ తర్వాత భారత్... 24న దక్షిణ కొరియాతో; 26న మలేసియాతో; 27న కెనడాతో; 29న పోలాండ్‌తో భారత్ తలపడుతుంది.
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 30న ఫైనల్ జరుగుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్యం కోసం పోటీపడతాయి. చీఫ్ కోచ్ లేకపోవడం, గాయాల తో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఈ టోర్నీ లో మంచి ప్రదర్శన చేస్తామని భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గతేడాది ఈ టోర్నీ లో భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 36 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిచి, రెండుసార్లు రన్నరప్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఏడుసార్లు మూడో స్థానాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment