
లాడర్‌హిల్ (అమెరికా): మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 13 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 23 పరుగులు (16 బంతుల్లో 4 ఫోర్లు) చేసి కీమోపాల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 66 (48 బంతుల్లో; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు ) హాఫ్ సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా విరాట్ కోహ్లి (16) క్రీజులో ఉన్నాడు.