
వందలోపే ఆలౌట్
కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాట్స్మెన్లు ఏ సమయంలోనూ ఆకట్టుకోలేక పోయారు. బ్యాటింగ్ కు వచ్చిన వారందరూ ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు. దీంతో17.2 ఓవరల్లో 92 పరుగులకు భారత్ అలౌటైంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ వెంట వెంటనే శిఖర్ ధావన్(11), కోహ్లి(1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. నిలకడగా ఆడుతున్న సమయంలోనే రోహిత్ శర్మ(22) రనౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు పరుగులేమీ చేయకుండానే రబాడా బౌలింగ్ లో అవుటయ్యాడు. వికెట్లు కోల్పోయి ఒత్తడిలో ఉన్న సమయంలో 67 పరుగుల వద్ద ధోని(5) కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆతర్వాత రైనా(22), హర్భజన్(0) లు వెంటవెంటనే అవుటయ్యారు. అక్షర్ పటేల్(9), కుమార్ డకౌట్ అయ్యాడు. అశ్విన్(11) పదో వికెట్ రూపంలో 92 పరుగుల వద్ద మోరిస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దక్షిణాఫ్రికా బౌలింగ్ లో మోర్కెల్కు మూడు, తాహీర్, మోరిస్లకు రెండు వికెట్ లు లభించాయి.