ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై జీవిత చరిత్రగా రానున్న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ అనే సినిమాకు కేరళ, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్నును మినహాయించాయి. ఈనెల 26న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘ఓ వ్యక్తి అకుంఠిత దీక్ష, పట్టుదలకు అద్దం పట్టే చిత్రమిది. నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది.
ఎలాంటి అడ్డంకులు ఎదురైనా జీవితంలో అనుకున్నది సాధించాలనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపును ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని చిత్ర నిర్మాత రవి భగ్‌చందా తెలిపారు. చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి క్రికెటర్‌గా సచిన్ ఎదిగిన ప్రస్థానాన్ని అభిమానులు ఈ చిత్రంలో చూడవచ్చు.
‘సచిన్’కు పన్ను మినహాయింపు
Published Fri, May 19 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
Advertisement
Advertisement