
సాక్షి, హైదరాబాద్: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ షాట్‌గన్ ఈవెంట్స్‌లో తెలంగాణ మహిళల జట్లు రాణించాయి. జాతీయ రైఫిల్ సంఘం ఆధ్వర్యంలో జైపూర్‌లోని రాజస్తాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన ఈ టోర్నీ మహిళల, జూనియర్ మహిళల విభాగాల్లో రెండు కాంస్యాలను సాధించాయి. సోమవారం జరిగిన మహిళల క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ జాతీయ చాంపియన్‌షిప్ టీమ్ ఈవెంట్‌లో జహ్రా ముఫద్దల్ దీసవాలా, రష్మీ రాథోడ్, దండు కాత్యాయిని రాజులతో కూడిన తెలంగాణ జట్టు ఆకట్టుకుంది.
ఫైనల్లో ఓవరాల్‌గా 319 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. జూనియర్ మహిళల క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ ఈవెంట్‌లో జహ్రా ముఫద్దల్ దీసవాలా, దండు కాత్యాయిని, సొనాలీ రాజులతో కూడిన తెలంగాణ బృందం 304 పాయింట్లు స్కోర్ చేసి కాంస్యాన్ని అందుకుంది. జాతీయ స్థాయి స్కీట్ షూటింగ్ మహిళల టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు కాంస్యాన్ని సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment