తెలంగాణ జట్ల శుభారంభం | telangana teams win at national badminton tourney | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్ల శుభారంభం

Published Thu, Jul 28 2016 8:50 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

తెలంగాణ జట్ల శుభారంభం

తెలంగాణ జట్ల శుభారంభం

జాతీయ సబ్-జూనియర్ సెపక్‌తక్రా టోర్నీ
 
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాల, బాలికల జట్లు శుభారంభం చేశాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర ఈవెంట్‌లో రాష్ట్ర జట్టు (21-8, 21-6), (21-10, 21-11), (21-8, 21-8)తో కేరళపై గెలుపొందింది. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు మొదట (18-21, 15-21), (21-16, 18-21, 21-10), (21-12, 21-7)తో ఢిల్లీపై నెగ్గింది. అనంతరం రెండో మ్యాచ్‌లో (11-21, 14-21), (21-17, 21-13), (21-8, 21-10)తో గోవాపై విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ఒడిశా (21-17, 17-21, 16-21), (21-6, 21-8), (21-11, 21-4)తో గోవాపై, ఢిల్లీ (3-21, 2-21), (18-21, 21-15, 21-13), (21-15, 21-6)తో గోవాపై గెలుపొందాయి.

బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ (21-5, 21-13), (21-7, 21-13), (21-13, 21-13)తో తమిళనాడుపై గెలిచింది. ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభించారు. ఇందులో గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, భారత సెపక్‌తక్రా సమాఖ్య కార్యదర్శి యోగేందర్ సింగ్ దహియా, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమత గుప్తా, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె.రంగారావు, ప్రేమ్‌రాజ్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాబయ్య, డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement