ముంబై" కరోనా వైరస్‌ను తరమికొట్టేందుకు తాము సైతం ఉన్నామంటూ క్రీడాకారులు, సినీ స్టార్స్ ఇలా అంతా నడుంబిగించారు. ఈ క్రమంలోనే ఎవరికి తోచింది వారు విరాళాలుగా ప్రకటిస్తున్నారు. శుక్రవారం క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన వంత సాయాన్ని ప‍్రకటించాడు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి రూ. 50 లక్షలను సచిన్ ఇచ్చాడు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు పలు విధాలుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. కొంతమంది తమ నెలసరి జీతాలను విరాళాలుగా ప్రకటించగా, మరి కొంతమంది మెడికల్ ఎక్విప్‌మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చి ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. (లాక్‌డౌన్ : వాట్సప్‌ను తెగ వాడేస్తున్నారు)
కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో ఆర్థిక పరంగా ప్రభుత్వానికి తనవంతు చేయూతనిచ్చే క్రమంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రూ. 10 లక్షలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్టాలకు కలిపి ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి చెరో రూ. 5 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఇక భారత క్రికెటర్ల పరంగా చూస్తే ఇర్ఫాన్ పఠాన్-యూసఫ్ పఠాన్‌లు నాలుగు వేల మాస్క్‌లు అందివ్వడానికి ముందుకొచ్చారు. అథ్లెట్లలో రెజ్లర్ బజరంగ్ పూనియా, స్పింటర్ హిమదాస్‌లు తమ జీతాల్ని డొనేట్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment