
ముంబై: భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. కాగా సచిన్‌కు కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ”కరోనా టెస్టు చేయించుకోగా.. నాకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కుటుంబంలో మిగిలిన వారికి నెగటివ్ తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఆరోగ్య సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు” అని సచిన్ ట్వీట్ చేశారు.
కాగా సచిన్ ఇటీవలే రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి:
రనౌట్ వివాదం.. స్టోక్స్ అవుటా.. కాదా?
ప్రముఖ క్రికెటర్ ఇంట విషాదం.. సచిన్ సంతాపం
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021
Comments
Please login to add a commentAdd a comment