న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్‌ను భారత హాకీ జట్టు కోచ్‌గా నియమించినట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. ఆయనకు నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవముంది. కెరీర్ అనంతరం కోచ్‌గాను విశేష అనుభవజ్ఞుడైన వాల్ష్ భారత సీనియర్ పురుషుల జట్టుకు సేవలందిస్తారని హెచ్‌ఐ కార్యదర్శి నరీందర్ బాత్రా తెలిపారు. తదుపరి కీలకమైన టోర్నీల దృష్టా టీమిండియాను ఆయన గాడిన పెడతారనే విశ్వాసాన్ని బాత్రా వెలిబుచ్చారు.
వరల్డ్ లీగ్ రౌండ్-4తో పాటు తదుపరి చాంపియన్స్ ట్రోఫీ వరకు భారత్ మూడు ప్రధాన ఈవెంట్లలో పాల్గొననుంది. ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో టీమిండియా తలపడనుంది. భారత జట్టుతో కలిసి పనిచేసే అవకాశం లభించడం పట్ల వాల్ష్ సంతోషం వ్యక్తం చేశారు. 1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.
భారత హాకీ కోచ్‌గా వాల్ష్
Published Wed, Oct 16 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement