సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా సెంట్రల్ జోన్ స్పోర్ట్స్ క్విజ్‌లో తనుష్ గాంధీ, నాసిర్ అబ్దుల్లా విజేతలుగా నిలిచారు. ఇందిరా పార్క్ స్కేటింగ్ రింక్‌లో రోలర్ స్కేటింగ్ శిక్షణ తీసుకుంటున్న వీరిద్దరూ బుధవారం విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలిచారు. ఇందులో అభిలాష్, ప్రేమ్ జంట రెండో స్థానం పొందారు. వీళ్లు లాల్‌బహదూర్ ప్లే గ్రౌండ్‌లో క్రికెట్ నేర్చుకుంటున్నారు.
విక్టరీ ప్లేగ్రౌండ్‌లో సెపక్‌తక్రా శిక్షణ తీసుకుంటున్న అభిరూప్-శశాంక్ జోడి మూడో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (స్పోర్ట్స్), ఎ.అన్నపూర్ణ, సుల్తాన్ బజార్ కార్పొరేటర్ శ్రీరాంచందర్ రాజు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, అసిస్టెంట్ డెరైక్టర్ ఫ్రాన్సిస్ రొసారియో పాల్గొన్నారు.
క్విజ్‌లో నెగ్గిన తనుష్, అబ్దుల్లా
Published Thu, May 29 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement