గచ్చిబౌలి కేవీఎస్ బాలుర జట్టుకు టైటిల్ | The boys' team title gaccibauli kevies | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలి కేవీఎస్ బాలుర జట్టుకు టైటిల్

Published Mon, Nov 17 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

గచ్చిబౌలి కేవీఎస్ బాలుర జట్టుకు టైటిల్

గచ్చిబౌలి కేవీఎస్ బాలుర జట్టుకు టైటిల్

ఎల్బీ స్టేడియం: జేఎఫ్‌హెచ్‌ఏ ఇంటర్ స్కూల్స్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యాలయం (కేవీ) హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. హాకీ ఒలింపియన్ జూడ్ ఫెలిక్స్ హాకీ అకాడ మీ(జెఎఫ్‌హెచ్‌ఏ) ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగం ఫైనల్లో గచ్చిబౌలి కేవీఎస్ జట్టు 4-0 స్కోరుతో జేఎఫ్‌హెచ్‌ఏ స్కూల్ జట్టుపై విజయం సాధించింది.

ఈ టోర్నీలో రాహుల్ దాస్ బెస్ట్ ప్లేయర్‌గా,  సూర్య ప్రకాష్ బెస్ట్ ఫార్వర్డ్ ఆటగాడిగా అవార్డును అందుకున్నాడు. ఎం.ఎ.ఎస్.కుషాల్ ప్రతాప్,  విశ్వజిత్ శుక్లాలు మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెల్చుకోగా, నజీబుల్లా బెస్ట్ గోల్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement