ప్రతుల్‌కు తొలి టైటిల్ | The first title to pratul | Sakshi
Sakshi News home page

ప్రతుల్‌కు తొలి టైటిల్

Published Wed, Nov 2 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ప్రతుల్‌కు తొలి టైటిల్

ప్రతుల్‌కు తొలి టైటిల్

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువతార ప్రతుల్ జోషి తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. బహ్రెరుున్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ప్రతుల్ 21-17, 12-21, 21-15తో తన తమ్ముడు ఆదిత్య జోషిపై విజయం సాధించాడు.

సెమీఫైనల్స్‌లో ప్రతుల్ 21-16, 22-20తో సిద్ధార్థ్ ఠాకూర్ (భారత్)పై నెగ్గగా... ప్రపంచ జూనియర్ మాజీ నంబర్‌వన్ ఆదిత్య 21-19, 21-7తో టాప్ సీడ్ ఆనంద్ పవార్ (భారత్)పై సంచలన విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో విఘ్నేశ్ దేవాల్కర్-రోహన్ కపూర్ జోడీ; మహిళల డబుల్స్‌లో ఫర్హా మాథెర్-ఆష్నా రాయ్ జంట రన్నరప్‌గా నిలిచారుు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement