లక్ష్యం 10కి పైగా పతకాలు: సోనోవాల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత్ పదికి పైగా పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ ప్రకటించారు. ఇందుకోసం ఏడాది క్రితం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆటగాళ్లకు తగిన శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘
ఏడాది క్రితం మేం ఏర్పాటు చేసిన కమిటీ పతకం గెలిచే అవకాశం ఉన్న 110 మందిని ఎంపిక చేసింది. ఇందులో ఇప్పటికే 76 మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కటాఫ్ తేదీలోగా మరికొందరు క్వాలిఫై అవుతారు. ఈసారి మేం కనీసం 10 పతకాలను ఆశిస్తున్నాం’ అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.