గేల్ లేకుండానే భారత్‌కు...
వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా): విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ లేకుండానే వెస్టిండీస్ జట్టు భారత్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ నెల 8నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ బోర్డు బుధవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. కండరాల గాయంతో బాధ పడుతున్న గేల్ ఇంకా కోలుకోనందున అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. గత రెండు సిరీస్‌లలో జట్టులో స్థానం కోల్పోయిన శామ్యూల్స్, డ్వేన్ స్మిత్‌లకు మళ్లీ చోటు దక్కింది. పేసర్ జెరోమీ టేలర్‌కు కూడా నాలుగేళ్ల తర్వాత మళ్లీ పిలుపొచ్చింది.
భారత్‌తో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), డారెన్ బ్రేవో, హోల్డర్, లియోన్ జాన్సన్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, రామ్‌దిన్, రవి రాంపాల్, కీమర్ రోచ్, ఆండ్రీ రసెల్, డారెన్ స్యామీ, శామ్యూల్స్, సిమన్స్, డ్వేన్ స్మిత్, టేలర్.