
ఆంటిగ్వా: టీమిండియాతో వన్డే, టీ 20 సిరీస్‌లకు సంబంధించి ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్‌కు చోటు దక్కలేదు. ఈ మేరకు రెండు సిరీస్‌లకు సంబంధించి సోమవారం విడుదల చేసిన 15 మందితో కూడిన జట్టు నుంచి గేల్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కొంతకాలం విశ్రాంతి కావాలని గేల్ కోరడంతో భారత్‌తో సిరీస్‌తో పాటు బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు కూడా అతన్ని పక్కను పెట్టేశారు. కాగా, భారత్‌తో్ జరుగనున్న టీ 20 సిరీస్‌లో డారెన్ బ్రేవో, పొలార్డ్‌లకు అవకాశం కల్పించారు. మరొకవైపు గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి పక్కను పెట్టిన ఆండ్రీ రస్సెల్‌కు మాత్రం టీ20 జట్టులో చోటు కల్పించారు. వన్డే సిరీస్‌కు జాసన్ హోల్డర్ సారథిగా వ్యవహరిస్తుండగా, టీ 20 సిరీస్‌క కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా నియమించారు.
‘భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు బంగ్లాదేశ్ పర్యటనకు కూడా స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ లేకుండానే ఎంపిక చేశాం. కొన్ని వ్యక్తిగత కారణాలతో భారత పర్యటనకు గేల్ దూరమయ్యాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు గేల్ అందుబాటులో ఉంటాడు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో కూడా గేల్ ఆడతాడు’ అని విండీస్ సెలక్షన్ ప్యానల్ చైర్మన్ కర్ట‍్నీ బ్రౌన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment