
ముంబై: సొంతగడ్డపై సత్తా చాటుతూ వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ గెలుచుకున్న భారత మహిళల జట్టు మరో ‘రెండు పాయింట్లు’ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో నేడు భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.
సిరీస్‌ను ఇప్పటికే 2–0తో సొంతం చేసుకున్న మిథాలీ సేన మరో మ్యాచ్ కూడా గెలిస్తే 2021 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించేందుకు మరింత చేరువవుతుంది. మరోవైపు ఇంగ్లండ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఐసీసీ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దిగువన ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం ఇక్కడైనా గెలిచి రెండు పాయింట్లు చేర్చుకోవాలని భావిస్తోంది.
►ఉదయం గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment