అయ్యో టీమిండియా‌.. ఆమె ఎక్కడ? | Twitter Remembered Nita Ambani during World Cup Semis | Sakshi
Sakshi News home page

అయ్యో టీమిండియా‌.. ఆమె ఎక్కడ?

Published Wed, Jul 10 2019 8:06 PM | Last Updated on Wed, Jul 10 2019 8:11 PM

Twitter Remembered Nita Ambani during World Cup Semis - Sakshi

ఆమె వచ్చుంటే సెమీఫైనల్లో టీమిండియా విజయం సాధించేదని, నీతా మంత్రాలు చాలా పవర్‌ఫుల్‌ అని...

మాంచెస్టర్: న్యూజిలాండ్‌తో సెమీస్‌తో టీమిండియా టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు పెవిలియన్‌కు వరుస కట్టడంతో క్రికెట్‌ అభిమానులు అద్భుతం జరగాలని కోరుకున్నారు. మ్యాచ్‌ జరుగుతుండగా నీతా అంబానీని గుర్తు చేసుకోవడంతో ట్విటర్‌లో ఆమె ట్రెండింగ్‌గా మారారు. ప్రపంచకప్‌ మ్యాచ్‌​కు నీతాకు సంబంధమేంటని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఏడాది జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జట్టు విజేతగా సంగతి తెలిసిందే కదా. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఉన్న నీతా అంబానీ మనసులో ఏవో మంత్రాలు జపించి దేవుడిని తలుచుకున్నారు. అంతే! ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ దక్కించుకుంది.

వరల్డ్‌కప్‌ టూర్‌లో టీమిండియా వెంట ఉండాలని నీతా అంబానీని కోరుతూ ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్‌ శిల్పి తివారీ మే నెలలో పోస్ట్‌ చేసిన వీడియోను క్రికెట్‌ అభిమానులు ఈరోజు ట్విటర్‌లో విపరీతంగా షేర్‌ చేయడంతో ఆమె ట్రెండింగ్‌లో నిలిచారు. టీమిండియా బ్యాటింగ్‌ చూసిన అభిమానులు.. ‘నీతా మంత్రాలు మాత్రమే భారత జట్టును కాపాడగలవు’ అంటూ కామెంట్లు పెట్టారు. ‘మేడమ్‌ మీ పూజలు చాలా  పవర్‌ఫుల్‌.. టీమిండియా కోసం ప్రార్థించరా ప్రీజ్‌’ అంటూ నీతాను వేడుకున్నారు. ‘నీతా అంబానీ ఎక్కడ ఉన్నారు. ఆమె అవసరం చాలా ఉంది. నన్ను నమ్మండి. ఆమె ప్రార్థనలు చాలా బాగా పనిచేస్తాయ’ని పేర్కొన్నారు. నీతా అంబానీ లాంటి ప్రతి ఇంట్లో ఉంచి ప్రార్థనలు చేస్తే టీమిండియా గెలిచేదని అభిప్రాయపడ్డారు. సెమీస్‌లో టీమిండియా చెత్త బ్యాటింగ్‌ కారణంగా నీతా అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ‘ధోని మాత్రమే రక్షించగలడు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement