రెండు రోజులు ఎంజాయ్‌! | Two days vacation for Indian cricketers | Sakshi
Sakshi News home page

రెండు రోజులు ఎంజాయ్‌!

Jun 18 2019 5:51 AM | Updated on Jun 18 2019 5:51 AM

Two days vacation for Indian cricketers - Sakshi

మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ స్టేడియంలో భారత క్రికెటర్లు విజయ్‌ శంకర్, దినేశ్‌ కార్తీక్, యజువేంద్ర చహల్‌

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో అజేయంగా సాగుతున్న భారత క్రికెట్‌ జట్టు కాస్త సేదతీరాలని నిర్ణయించుకుంది. ఆటగాళ్లకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో క్రికెటర్లకు ప్రాక్టీస్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఆదివారం పాక్‌పై అద్భుత విజయం తర్వాత టీమిండియాలో జోష్‌ వెల్లువెత్తుతుండగా... ఆటగాళ్లంతా విరామంలో సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యారు. భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 22న అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. మరోవైపు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన భారత జట్టుకు ఇంగ్లండ్‌లోని విఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ (ఎంయూ) శుభాకాంక్షలు తెలిపింది. మ్యాచ్‌కు ముందు పలువురు భారత ఆటగాళ్లు మాంచెస్టర్‌లోని ఎంయూ స్టేడియాన్ని సందర్శించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement