
భారత బధిర క్రికెట్ జట్టులో ఇద్దరు మనోళ్లు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో జరుగనున్న ఆసియా బధిర టి20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. హైదరాబాద్ బధిర క్రికెట్ సంఘానికి చెందిన జి. రాజారామ్, మోజెస్ పీటర్ భారతక్రికెట్ జట్టుకు హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. బంగ్లాదేశ్ డెఫ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జట్టుతో ఢాకాలో మార్చి 20 నుంచి 27 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది.