సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్‌బీఏ జామ్ టోర్నమెంట్‌లో జూనియర్ ఫైవ్, హెర్డ్‌వాల్స్ జట్లు ఘనవిజయాలు సాధించాయి. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో గురువారం మొదలైన ఈ టోర్నమెంట్‌లో జూనియర్ ఫైవ్ 21-5తో రామన్ హీట్ జట్టుపై గెలుపొందగా, హెర్డ్‌వాల్స్ 17-2తో భవాన్స్ జట్టు (సైనిక్‌పురి)ను కంగుతినిపించింది. ఇతర పోటీల్లో ఆర్మీ స్కూల్-1 జట్టు 14-2తో గ్లాడియేటర్స్ జట్టుపై నెగ్గగా, ఎక్స్‌పాండ్ జట్టు 9-15తో అవంతి జట్టు చేతిలో ఓడింది.
ఫ్లయింగ్ లాన్సర్స్ 7-4తో విజార్డ్స్‌పై, చైతన్య చాంపియన్స్ 14-1తో రాకెట్స్ జట్టుపై, హార్డ్‌కోర్ జట్టు 16-7తో ఈగల్స్ జట్టుపై, ది ఫాక్స్‌ట్రాట్స్ 5-4తో ఫాంటమ్స్‌పై, ఏపీఎస్‌ఆర్‌కేపీ 11-5తో ఎస్‌ఎన్‌టీపై గెలుపొందాయి. మరో మ్యాచ్‌లో ఈగల్స్ జట్టుకు 5-15తో కేపీహెచ్‌బీ చేతిలో పరాజయం ఎదురవగా, వైఎంసీఏ కాలేజి 15-8తో ఎంజీఎంపై, పంపర్స్ 16-3తో ఎంజీఎం సీబీఎస్‌ఈపై, నైట్ 7-4తో లయోలా అకాడమీపై విజయం సాధించాయి. స్ట్రయికర్స్ 6-12తో బ్లాకర్స్ చేతిలో ఓడగా, ఎంజేసీఈటీ 11-3తో రైజింగ్ స్టార్స్‌పై గెలిచింది. బ్లేజింగ్ డ్రిబ్లర్స్ 3-7తో వెస్లీ పిస్టన్స్ చేతిలో, షూటర్స్ 5-12తో నూగెట్స్ చేతిలో, క్రాసింగ్ మీటరైడ్స్ 6-9తో బీవీఆర్‌ఐటీ చేతిలో కంగుతిన్నాయి.
జూనియర్ ఫైవ్ ఘనవిజయం
Published Fri, Sep 6 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement