కోపా కప్ లో వెనుజులా శుభారంభం | Venezuela win 1-0 against 10-man Jamaica | Sakshi
Sakshi News home page

కోపా కప్ లో వెనుజులా శుభారంభం

Published Mon, Jun 6 2016 5:19 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Venezuela win 1-0 against 10-man Jamaica

చికాగో:కోపా అమెరికా కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో వెనుజులా శుభారంభం చేసింది. గ్రూప్-సిలో భాగంగా సోమవారం  జరిగిన పోరులో వెనుజులా 1-0తేడాతో జమైకాపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో జమైకాకు గోల్స్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై ఓటమి పాలైంది. ప్రత్యేకంగా ఆట 11 వ నిమిషంలో బంతిని గోల్ గా మలచే అవకాశాన్ని జమైకా జారవిడుచుకోవడంతో ఆ తరువాత తేరుకోలేకపోయింది.

 

ఆ తరువాత మరో నాలుగు నిమిషాల వ్యవధిలో వెనుజులా తొలి గోల్ను సాధించి ఆధిక్యం సాధించింది. ఆపై ఆట 23 వ నిమిషంలో జమైకా మిడ్ ఫీల్డర్ రాడాల్ఫ్ ఆస్టిన్ రెడ్ కార్డ్ బారిన పడి బెంచ్కే పరిమితం కావడం కూడా ఆ జట్టు ఆటపై ప్రభావం చూపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న వెనుజులా చివరి వరకూ జమైకాను కట్టడి చేసి విజయం నమోదు చేసింది. ఇదిలా ఉండగా, మరోపోరులో మెక్సికో 3-1 తేడాతో ఉరుగ్వేపై విజయం సాధించింది. వెనుజులా తన రెండో పోరులో గురువారం ఉరుగ్వేతో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement