విరాట్ కోహ్లి మళ్లీ విఫలం
బెంగళూరు:ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి కూడా నిరాశపరిచాడు. శనివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఆరంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లి(12) వైఫల్యం చెందాడు. ఆసీస్ స్పిన్నర్ లయన్ బౌలింగ్ లో కోహ్లి ఎల్బీగా అవుటయ్యాడు. దాంతో 88 పరుగుల వద్ద భారత్ జట్టు మూడో వికెట్ ను కోల్సోయింది. అంతకుముందు చటేశ్వర పూజారా(17),అభినవ్ ముకుంద్(0)లు సైతం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అభినవ్ ముకుంద్ పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. ఆ తరువాత పూజారా-కేఎల్ రాహుల్ జంట ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జంట 61 పరుగులు జత చేసిన తరువాత పూజారా అవుటయ్యాడు. ఆపై కాసేపటికి కోహ్లి వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది.