
సాక్షి, హైదరాబాద్: సర్బిటాన్ ట్రోఫీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట నిష్క్రమించింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 4–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో పరాజయం పాలైంది.
70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జోడీ ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌లో ఒకసారి సర్వీస్ చేజార్చుకున్న భారత జంట రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది. క్వార్టర్స్‌లో ఓడిన విష్ణు–బాలాజీ జంటకు 1,630 పౌండ్ల (రూ. లక్షా 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment