
విజేత విష్ణువర్ధన్
కోల్‌కతా: జాతీయ గ్రాస్ కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ విజేతగా అవతరించాడు. శనివారం జరిగిన ఫైనల్లో రికార్డు స్థాయిలో 25 ఏస్‌లు సంధించిన విష్ణు 6-4, 7-6 (7/4) తేడాతో మోహిత్ మయూర్‌ను మట్టికరిపించాడు. 2009లో అషుతోష్ సింగ్ 11 ఏస్‌లతో ఈ టోర్నీ సాధించగా విష్ణు సరికొత్త రికార్డు సృష్టించాడు.
మహిళల సింగిల్స్‌లో రష్మీ చక్రవర్తి (తమిళనాడు)ని ఓడించిన నటాషా (గోవా) కొత్త చాంపియన్‌గా నిలి చింది. పురుషుల డబుల్స్‌లో ఏపీ ఆటగాడు అశ్విన్ విజయరాఘవన్, రోనక్ మనూజా (మహారాష్ట్ర) 7-6(7/2), 6-4తో విజయ్ సుందర్ ప్రశాంత్, ఫరీజ్ (తమిళనాడు)పై గెలిచి టైటిల్ సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కాల్వ భువన తన భాగస్వామి రష్మీ చ క్రవర్తితో కలిసి టైటిల్ సాధించింది. ఫైనల్లో భువన-రష్మీ ద్వయం 6-2, 7-6 (7/4)తో నటాషా (గోవా)-నిధి చిలుముల (ఆంధ్రప్రదేశ్) జోడిని ఓడించింది.