తుదిపోరుకు విష్ణువర్ధన్ | vishnuvardhan ready to won tennis title | Sakshi
Sakshi News home page

తుదిపోరుకు విష్ణువర్ధన్

Published Sat, Jan 18 2014 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

vishnuvardhan ready to won tennis title

 కోల్‌కతా: జాతీయ గ్రాస్‌కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ విష్ణువర్ధన్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి, కాల్వ భువనలకు సెమీఫైనల్లో చుక్కెదురైంది.

ఈ టోర్నీలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో సీడ్ విష్ణు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 6-3, 6-2తో అశ్విన్ విజయరాఘవన్ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందగా, రెండో సీడ్ మోహిత్ మయూర్ (తమిళనాడు) 6-4, 3-0 చంద్రిల్ సూద్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గాడు. రెండో సెట్‌లో 0-3తో వెనుకబడిన దశలో చంద్రిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఫైనల్లో మోహిత్‌తో విష్ణు తలపడతాడు. మహిళల సింగిల్స్ సెమీస్‌లో రష్మీ చక్రవర్తి (తమిళనాడు) 6-4, 4-6, 6-3తో శ్రీవైష్ణవిపై, రెండో సీడ్ నటాషా పల్హా (గోవా) 7-5, 5-7తో ఐదో సీడ్ భువనపై గెలుపొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement