పాకిస్తాన్‌ను గెలిపించిన వసీం | Wasim Akram of Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ను గెలిపించిన వసీం

Published Sun, Sep 27 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

పాకిస్తాన్‌ను గెలిపించిన వసీం

పాకిస్తాన్‌ను గెలిపించిన వసీం

హరారే: లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ వసీం (4/11) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేతో తొలి టి20లో పాకిస్తాన్ గట్టిక్కెంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 13 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది.

షోయబ్ మాలిక్ (24 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (32 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. చిబాబాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిగుంబురా (28 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం ఇదే మైదానంలో జరుగుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement