కొలంబో: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ (5/42) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్‌ను కుప్పకూల్చాడు. కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న ఈ బౌలర్ ధాటికి.... గురువారం తొలి రోజు పాక్ 42.5 ఓవర్లలో కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (75 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. లంచ్ విరామం అనంతరం 49 పరుగుల వ్యవధిలోనే పాక్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దమ్మిక ప్రసాద్‌కు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక రోజు ముగిసే సమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో కౌశల్ సిల్వ (21 బ్యాటింగ్; 3 ఫోర్లు), సంగక్కర (36 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు.
కుప్పకూలిన పాకిస్తాన్
Published Fri, Jun 26 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement