ఇదే దూకుడు కొనసాగిస్తాం: ధోనీ | We will continue to be aggressive: Dhoni | Sakshi
Sakshi News home page

ఇదే దూకుడు కొనసాగిస్తాం: ధోనీ

Published Tue, Dec 16 2014 2:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

ఇదే దూకుడు కొనసాగిస్తాం: ధోనీ

ఇదే దూకుడు కొనసాగిస్తాం: ధోనీ

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భారత్ దూకుడు కొనసాగిస్తుందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. గాయం కారణంగా ఆసీస్తో తొలి టెస్టుకు దూరమైన ధోనీ.. బుధవారం నుంచి జరిగే రెండో టెస్టుకు జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ తొలి టెస్టులో ఓటమి చవిచూసినా పోరాటపటిమతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భారత్ ఆటతీరును ధోనీ ప్రశంసించాడు. ఈ సిరీస్లో దూకుడైన క్రికెట్ ఆడుతామని ధోనీ చెప్పాడు.

బ్రిస్బేన్ టెస్టుకు భారీ భద్రత: సిడ్నీ ఘటన నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం లోపల, వెలుపల పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్టు అధికారులు చెప్పారు. ఆగంతకుడు సిడ్నీలోని ఓ కేఫ్లో బందీలుగా నిర్బంధించిన సంగతి తెలిసిందే. కమెండో ఆపరేషన్ చేపట్టి బందీలు రక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement