
ఎవరొచ్చినా ఓడిస్తాం.. కప్పు మాదే
ఆక్లాండ్: వన్డే ప్రపంచ కప్ 2015పై న్యూజిలాండ్ కన్నేసింది. ఈసారి ప్రపంచ కప్ తమదేనని న్యూజిలాండ్ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము కచ్చితంగా కప్ను ఎగరేసుకుపోతామని చెప్తున్నారు. కివీస్ మాజీ బౌలర్ జాకబ్ ఓరం మాట్లాడుతూ సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే సెమీ ఫైనల్లో ఏ టీం ఫైనల్కు వచ్చినా వారిని ఓడిస్తామని తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. మరో పక్క ప్రపంచ కప్ గెలిచి వెటోరికి బ్రహ్మాండమైన వీడ్కోలు పలుకుతామని న్యూజిలాండ్ కెప్టెన్ మెక్ కలమ్ చెప్పారు. సెమీ ఫైనల్లో కివీస్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ బెర్తు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.