cricket-world-cup-2015
-
ఎవరొచ్చినా ఓడిస్తాం.. కప్పు మాదే
ఆక్లాండ్: వన్డే ప్రపంచ కప్ 2015పై న్యూజిలాండ్ కన్నేసింది. ఈసారి ప్రపంచ కప్ తమదేనని న్యూజిలాండ్ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము కచ్చితంగా కప్‌ను ఎగరేసుకుపోతామని చెప్తున్నారు. కివీస్ మాజీ బౌలర్ జాకబ్ ఓరం మాట్లాడుతూ సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే సెమీ ఫైనల్లో ఏ టీం ఫైనల్‌కు వచ్చినా వారిని ఓడిస్తామని తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. మరో పక్క ప్రపంచ కప్ గెలిచి వెటోరికి బ్రహ్మాండమైన వీడ్కోలు పలుకుతామని న్యూజిలాండ్ కెప్టెన్ మెక్ కలమ్ చెప్పారు. సెమీ ఫైనల్లో కివీస్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ బెర్తు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
టీమిండియాకు మోదీ అభినందనలు
క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించినందుకు టీమిండియాను ప్రధాని నరేంద్రమోదీ అభినందనల్లో ముంచెత్తారు. భారతజట్టు అద్భుత ప్రదర్శనను చూపించిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ జట్టుపై భారత్ అలా గెలిచిందో లేదో.. వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచకప్ ప్రస్తుత ఛాంపియన్ హోదాలో క్వార్టర్స్ బరిలోకి దిగిన టీమిండియా.. బాలబెబ్బులి లాంటి బంగ్లాదేశ్ జట్టును 109 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. బంగ్లాను ఓడించడం అంత సులువు కాదని సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా చెప్పినా.. భారతజట్టు మాత్రం సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ కూడా జట్టు ప్రదర్శనను అభినందించారు. -
'బంగ్లాను ఓడించడం అంత సులువు కాదు'
ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా నేరుగా వచ్చిన రెండే రెండు జట్లలో ఒకటి మన టీమిండియా. అలాంటి జట్టు.. బంగ్లాదేశ్ లాంటి పసికూనను ఓడించడానికి ఆలోచించాలా? అసలు వాళ్లను ఓడించడం అంత సులభం కాదని అంటున్నారు.. అలనాటి దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్. బంగ్లాదేశ్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, మహ్మదుల్లా ఎలాంటి ఆటనైనా తీసుకెళ్లిపోతాడని, ముష్ఫికుర్ రహీం, షకీబ్ కూడా మేజిక్ చేయగలరని అన్నారు. వాళ్లు ముందు బ్యాటింగ్ చేసి, 250 పరుగుల వరకు చేస్తే.. తర్వాత వాళ్ల బౌలింగులో ఆ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం భారత్‌కు అంత సులభం కాదని గవాస్కర్ చెప్పారు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మనోళ్లకు నిజమైన పరీక్ష ఎదురైందని, మనవాళ్లు గెలవాలనే ఆశిస్తున్నా.. అదయితే అందరూ అనుకుంటున్నంత సులభం కాదని చెప్పారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదని, అందువల్ల అక్కడ మరీ ఎక్కువగా సిక్సర్లు కొట్టే అవకాశం ఉండదని అన్నారు. వాతావరణం కాస్త మబ్బుగా ఉండి.. బాల్ తిరిగిందంటే.. బ్యాటింగ్ అంత సులభంగా ఉండదని సన్నీ చెప్పారు. ఇలాంటి పరిస్థితి భారత జట్టుకు కూడా అనువుగా ఉండొచ్చన్నారు. -
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరెవరు..?
-
నేడు సిడ్నిలో ఆస్ట్రేలియా vs శ్రీలంక
-
చెమటోడ్చి నెగ్గిన కివీస్
-
సఫారీలకు ఈసారైనా షాకిస్తారా?
ఎప్పుడూ శాంతంగా కనిపించే హషీం ఆమ్లా ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాడు.. ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించే ఫాస్ట్ బౌలర్లున్నారు.. సారథి డివిలియర్స్ 'ఫాస్టెస్ట్ సెంచరీ' ఊపుమీదున్నాడు.. తన పటిష్టతను ప్రదర్శించేందుకు మిడిల్ ఆర్డర్ సిద్ధంగా ఉంది.. ఇదీ సౌతాఫ్రికా జట్టు తాజా స్థితి. ఇక భారత్ పరిస్థితి అందుకు కొద్దిగా భిన్నం. పీడకలలా వెంటాడుతున్న ఓటమి సెంటిమెంటు. ప్రత్యర్థితో పోల్చితే బలహీన బౌలింగ్.. కెప్టెన్ ధోనీ, రోహిత్ శర్మల ఫామ్ లేమి.. ఆశించినంతగా ఆకట్టుకోలేకపోతున్న జడేజా, అశ్విన్.. వీటన్నింటి నడుమ వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న లీగ్ మ్యాచ్.. సౌతాఫ్రికా కంటే ఎక్కువ ఒత్తిడి భారత జట్టుకే ఉందనడంలో సందేహం లేదు. అయితే మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఉత్సాహం మరోసారి చూపిస్తే ఆ ఒత్తిడి దూదిపింజంలా ఎగిరి పోవడం ఖాయం. వరల్డ్ కప్‌లో సఫారీలపై వరుస ఓటముల సంప్రదాయానికి చరమగీతం పాడటమూ తథ్యం. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గితే భారత కెప్టెన్ ధోని కచ్చితంగా ఫీల్డింగే ఎంచుకుంటాడు. ఎందుకంటే.. 1992, 1999, 2011 వరల్డ్ కప్‌ల్లో సౌతాఫ్రికాతో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ భారత్‌కు కలిసి రాలేదు. 92 వరల్డ్ కప్‌లో ఆరు వికెట్ల తేడాతో, 99లో నాలుగు వికెట్ల తేడాతో, 2011లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో సఫారీల చేతిలో భారత్ ఓటమిపాలైంది. అన్నిసార్లూ మొదటి బ్యాటింగ్ టీమిండియాదే. ఈ నేపథ్యంలో ధోనీ ఈసారి టాస్ గెలిస్తే 'ఫస్ట్ ఫీల్డింగ్'కే మొగ్గు చూపుతాడని అంచనా. పాక్‌తో మ్యాచ్‌లో ధావన్, రైనా ఫామ్‌లోకి వచ్చారు కానీ రోహిత్ శర్మ, జడేజా, రహానే, ధోనీ పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. బౌలర్లలో మహ్మద్ షమీ (9 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు) మంచి ఊపుమీదున్నాడు. మన పేస్ త్రయం షమీ, ఉమేశ్, మోహిత్లో ఏ ఒక్కరు గాయం పాలైనా జట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే మైదానంలో పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న 'మిస్టర్ కూల్' ధోనీ కెప్టెన్సీ సామర్థ్యంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకుల భావన. ఇక సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బ్యాక్‌బోన్ హషీమ్ ఆమ్లా భారత్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఇటీవలే జరిగిన ఐసీఎల్ వేలంలో 'అమ్ముడుపోని ఆటగాడు'గా మిగిలిపోవడమే అతని కోపానికి కారణం! ఆదివారం జరిగే మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో భారత ఫ్రాంచైజీలకు రుచిచూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. జింబాంబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సఫారీలు 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. ఫస్ట్చేంజ్ బౌలర్‌గా వచ్చి 9 ఓవర్లు వేసిన డెల్ స్టెయిన్ ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ రెండూ భారత్‌కు సానుకూలాంశాలే. వీటిని అవకాశాలుగా మలచుకుని సఫారీలను చిత్తుచేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
ఒకరు హ్యాట్రిక్... మరొకరు హ్యాట్రిక్ మిస్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లిష్ బౌలర్లు చెలరేగిపోయారు. ఒకరు హ్యాట్రిక్ చేయగా.. మరొకరు కొద్దిలో హ్యాట్రిక్ మిస్సయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ ఫిన్.. వరుసగా మూడు వికెట్లు తీసి ఈ ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫిన్ మొత్తం 5 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్ పోటీలలో ఇలా హ్యాట్రిక్ సాధించిన వాళ్లలో ఫిన్ ఏడో బౌలర్. ఇంతకు ముందు ఆరుగురు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 6 అడుగుల 7 అంగుళాల పొడవున్న ఫిన్.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లోని చిట్ట చివరి మూడు బంతుల్లోనే మూడు వికెట్లను తీయడం విశేషం. అతడికి తోడుగా నిలిచిన మరో బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వరుస బంతుల్లో ఓపెనర్ వార్నర్ (22), వాట్సన్ (0)ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతి మిస్ కావడంతో అతడికి హ్యాట్రిక్ తప్పినట్లయింది. ప్రపంచ కప్ పూల్-ఎలో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో కంగారూలను ఈ ఇద్దరు బౌలర్లు కంగారెత్తించినా.. భారీ స్కోరు సాధించడం విశేషం.