
టీమిండియాకు మోదీ అభినందనలు
క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ప్రవేశించినందుకు టీమిండియాను ప్రధాని నరేంద్రమోదీ అభినందనల్లో ముంచెత్తారు. భారతజట్టు అద్భుత ప్రదర్శనను చూపించిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ జట్టుపై భారత్ అలా గెలిచిందో లేదో.. వెంటనే ఆయన ట్వీట్ చేశారు.
ప్రపంచకప్ ప్రస్తుత ఛాంపియన్ హోదాలో క్వార్టర్స్ బరిలోకి దిగిన టీమిండియా.. బాలబెబ్బులి లాంటి బంగ్లాదేశ్ జట్టును 109 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. బంగ్లాను ఓడించడం అంత సులువు కాదని సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా చెప్పినా.. భారతజట్టు మాత్రం సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ కూడా జట్టు ప్రదర్శనను అభినందించారు.