భారత ఒలింపిక్స్‌ బృందంతో ప్రధాని మోదీ సమావేశం | PM Modi Interacts With Indian Contingent For Paris Olympics 2024 | Sakshi
Sakshi News home page

భారత ఒలింపిక్స్‌ బృందంతో ప్రధాని మోదీ సమావేశం

Published Fri, Jul 5 2024 11:29 AM | Last Updated on Fri, Jul 5 2024 6:59 PM

PM Modi Interacts With Indian Contingent For Paris Olympics 2024

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (జులై 4) రాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ అథ్లెట్లతో సుదీర్ఘంగా సంభాషించారు. అథ్లెట్లు కూడా తమ లక్ష్యాలను ప్రధానికి వివరించారు. అనంతరం అథ్లెట్లు మోదీతో ఫోటోలు దిగారు. 

ఈ ఫోటోలను మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి భారత అథ్లెట్లకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పారు. మోదీ ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మా బృందంతో పరస్పద చర్చ జరిగింది. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని నమ్మకం ఉంది. వారి జీవిత ప్రయాణాలు, వారు సాధించిన విజయాలు 140 కోట్ల భారతీయులకు ఆశను కలిగిస్తున్నాయి.

కాగా, పారిస్‌ ఒలింపిక్స్‌ జులై 26 నుంచి ఆగస్ట్‌ 11 నుంచి ఆగస్ట్‌ 11 వరకు జరుగనున్నాయి. విశ్వక్రీడల్లో భారత్‌ నుంచి 28 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత బృందానికి జావెలిన్‌ త్రోయర్‌, టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. భారత బృందంలో 17 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు.

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు..

నీరజ్ చోప్రా (పురుషుల జావెలిన్ త్రో)
అవినాష్ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్)
కిషోర్ జెనా (పురుషుల జావెలిన్ త్రో)
తజిందర్‌పాల్ సింగ్ తూర్ (పురుషుల షాట్‌పుట్)
ప్రవీణ్ చిత్రవేల్ (పురుషుల ట్రిపుల్ జంప్)
అబ్దుల్లా అబూబకర్ (పురుషుల ట్రిపుల్ జంప్)
సర్వేష్ కుషారే (పురుషుల హైజంప్)
అక్షదీప్ సింగ్ (పురుషుల 20 కి.మీ రేసు నడక)
వికాష్ సింగ్ (పురుషుల 20 కి.మీ రేసు నడక)
పరమజీత్ సింగ్ బిష్త్ (పురుషుల 20 కి.మీ రేసు నడక)
మహమ్మద్ అనాస్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)
మహ్మద్ అజ్మల్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)
అమోజ్ జాకబ్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)
సంతోష్ కుమార్ తమిళరసన్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)
రాజేష్ రమేష్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)
మిజో చాకో కురియన్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)
సూరజ్ పన్వర్ (రేస్ వాక్ మిక్స్‌డ్ మారథాన్)
కిరణ్ పహల్ (మహిళల 400 మీ)
పారుల్ చౌదరి (మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ మరియు 5,000 మీ)
జ్యోతి యర్రాజి (మహిళల 100 మీటర్ల హర్డిల్స్)
అన్నూ రాణి (మహిళల జావెలిన్ త్రో)
అభా ఖతువా (మహిళల షాట్‌పుట్)
జ్యోతిక శ్రీ దండి (మహిళల 4x400 మీటర్ల రిలే)
శుభా వెంకటేశన్ (మహిళల 4x400 మీటర్ల రిలే)
విత్యా రాంరాజ్ (మహిళల 4x400 మీటర్ల రిలే)
ఎంఆర్ పూవమ్మ (మహిళల 4x400 మీటర్ల రిలే)
ప్రాచి (మహిళల 4x400 మీటర్ల రిలే)
ప్రియాంక గోస్వామి (మహిళల 20 కి.మీ రేస్ వాక్ మరియు రేస్ వాక్ మిక్స్‌డ్ మారథాన్)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement