విండీస్ 248/7 | West Indies 248-7 in 1st innings on 2nd day of 3rd test | Sakshi
Sakshi News home page

విండీస్ 248/7

Published Tue, Jan 5 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

West Indies 248-7 in 1st innings on 2nd day of 3rd test

 సిడ్నీ: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. ఫలితంగా రెండో రోజు ఆటలో కేవలం 11.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ (71 బంతుల్లో 69; 7 ఫోర్లు; 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. క్రీజులో దినేశ్ రామ్‌దిన్ (103 బంతుల్లో 30 బ్యాటింగ్; 2 ఫోర్లు), కీమర్ రోచ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement