విలియమ్సన్‌ సెంచరీ | Williamson Century | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌ సెంచరీ

Published Sat, Mar 11 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

విలియమ్సన్‌ సెంచరీ

విలియమ్సన్‌ సెంచరీ

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 341∙
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 38/1  


డ్యునెడిన్‌: కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (241 బంతుల్లో 130; 18 ఫోర్లు) సెంచరీ సహాయంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 144.3 ఓవర్లలో 341 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. వాట్లింగ్‌ (128 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రొటీస్‌పై కివీస్‌కు 33 పరుగుల ఆధిక్యం లభించింది. కేశవ్‌ మహరాజ్‌కు ఐదు... ఫిలాండర్, మోర్కెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు 18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 38 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. క్రీజులో ఎల్గర్‌ (12 బ్యాటింగ్‌), ఆమ్లా (23 బ్యాటింగ్‌) ఉన్నారు. ప్రస్తుతం ప్రొటీస్‌ 5 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఆటలో అలారం అలజడి
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో స్టేడియంలోని గ్రాండ్‌స్టాండ్‌ నుంచి ఫైర్‌ అలారం మోగడంతో 20 నిమిషాలపాటు ఆటకు అంతరాయం కలిగింది. ఈ హఠాత్పరిణామంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే రంగప్రవేశం చేసిన అగ్నిమాపక  సిబ్బంది ముందుగా మైదానంలోని గడ్డిని నీటితో తడిపేశారు. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు, మ్యాచ్‌ రిఫరీ, అంపైర్లు స్టేడియం మధ్యలోకి చేరుకోగా ప్రేక్షకులను బయటికి పంపేశారు. అయితే అలారం ఎందుకు మోగిందనే కారణం ఎవరికీ అంతుపట్టకపోవడంతో చివరికి ఆటను కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement