200 మీటర్ల విజేత షిపెర్స్
మహిళల 200 మీటర్ల విభాగంలో నెదర్లాండ్స్ అథ్లెట్ డాఫ్ని షిపెర్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం నెగ్గిన షిపెర్స్ శనివారం జరిగిన 200 మీటర్ల ఫైనల్ రేసును 22.05 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. మరియా జోస్ (ఐవరీకోస్ట్–22.08సె.) రజతం, షానీ మిల్లర్ (బహమాస్–22.15 సె.) కాంస్యం గెలిచారు.
మెర్లీన్ ఒట్టీ (జమైకా), అలీసన్ ఫెలిక్స్ (అమెరికా) తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల విభాగంలో వరుసగా రెండుసార్లు స్వర్ణం గెలిచిన మూడో అథ్లెట్‌గా షిపెర్స్ గుర్తింపు పొందింది. మహిళల లాంగ్‌జంప్‌లో బ్రిట్నీ రీస్ (అమెరికా–7.02 మీటర్లు)... పురుషుల హ్యామర్ త్రోలో పావెల్ (పోలాండ్–79.81 మీటర్లు)... మహిళల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో ఎమ్మా కోబర్న్ (అమెరికా–9ని:02.58 సెకన్లు) స్వర్ణాలు నెగ్గారు.