
భారత్‌కు తొలి గెలుపు
జొహన్నెస్‌బర్గ్: మహిళల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. చిలీతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1–0 గోల్‌తో గెలిచింది. ఆట 38వ నిమిషంలో ప్రీతి దూబే ఏకైక గోల్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈనెల 16న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది.