దేవధర్‌ ట్రోఫీ విజేత భారత్‌ ‘బి’  | Won 6 wickets against Karnataka in the final | Sakshi
Sakshi News home page

దేవధర్‌ ట్రోఫీ విజేత భారత్‌ ‘బి’ 

Published Fri, Mar 9 2018 1:10 AM | Last Updated on Fri, Mar 9 2018 1:10 AM

Won 6 wickets against Karnataka in the final - Sakshi

ధర్మశాల: దేవధర్‌ ట్రోఫీలో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో తన జట్టును ఫైనల్‌ చేర్చిన సమర్థ్‌ మరోసారి సెంచరీతో మెరిసినా కర్ణాటకకు టైటిల్‌ అందించలేకపోయాడు. గురువారం భారత్‌ ‘బి’తో జరిగిన ఫైనల్లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమర్థ్‌ (107; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత శతకం సాయంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేయగా... భారత్‌ ‘బి’ 48.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కర్ణాటకకు శుభారంభం దక్కలేదు. ఈ ఏడాది దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన మయాంక్‌ అగర్వాల్‌ (14), కరుణ్‌ నాయర్‌ (10) త్వరగానే అవుటయ్యారు.

అనంతరం ఫామ్‌లో ఉన్న సమర్థ్, సీఎం గౌతమ్‌ (74; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివర్లో శ్రేయస్‌ గోపాల్‌ (22 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3, ఉమేశ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ ‘బి’ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో విజయం సాధించింది. ఓపెనర్లు గైక్వాడ్‌ (58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఈశ్వరన్‌ (69; 8 ఫోర్లు)లతో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (61; 7 ఫోర్లు), మనోజ్‌ తివారి (59 నాటౌట్‌; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement