
లండన్: వరుసగా నాలుగోసారి పురుషుల ప్రపంచ చెస్ చాంపియన్‌గా నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో లండన్‌లో బుధవారం ముగిసిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ 9–6 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. తొలుత క్లాసిక్ పద్ధతిలో నిర్ణీత 12 గేమ్‌లు వరుసగా ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరూ 6–6తో సమంగా నిలిచారు.
విజేతను నిర్ణయించడానికి బుధవారం ర్యాపిడ్ పద్ధతిలో నాలుగు గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌లో కార్ల్‌సన్ 55 ఎత్తుల్లో... రెండో గేమ్‌లో 28 ఎత్తుల్లో, మూడో గేమ్‌లో 51 ఎత్తుల్లో గెలిచి 3–0తో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. కార్ల్‌సన్ 2013, 2014, 2016లలో కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment