సౌతాంప్టన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకపోతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలవగా ఒక మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో మ్యాచ్ గెలిచిన అనంతరం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆటగాళ్లు బుధవారం మళ్లీ మైదానంలో అడుగు పెట్టారు. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఉండడంతో గత మూడు రోజులుగా కఠోర సాధన చేస్తోంది.
ఈ సందర్భంగా సారథి విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, చహల్‌తో పాటు కొందరు ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు ముందు పుట్‌బాల్‌తో సరదాగా వార్మప్ చేశారు. కిందపడకుండా 41 సార్లు బంతిని పుష్ చేస్తూ చాలాసేపు గాల్లోనే ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. వీరికంటే ఎక్కువ సార్లు బంతిని గాల్లో ఉంచగలరా అంటూ ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.
ఇక గురువారం ప్రాక్టీస్‌లో భాగంగా జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో విజయ్ శంకర్ పాదానికి గాయమైంది. దీంతో ఈ రోజు కూడూ శంకర్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. అయితే అతడి గాయంపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌లో శంకర్‌కు విశ్రాంతినిచ్చి పంత్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే అఫ్గాన్‌ను తక్కువ అంచన వేయమని సారథి విరాట్ కోహ్లి పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment