
లండన్: కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచ కప్ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. సచిన్ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్‌లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్ ఉండీ ఒక్క టోర్నీ కూడా ఆడే అవకాశం దక్కనివారు ఎందరో. ఇక ఎంతో మందిని కాదని తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతీ ఒక్క క్రికెటర్ అనుకుంటారు. తాజాగా టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ కూడా ప్రపంచకప్‌లో టీమిండియా కోసం తన వంతు పాత్రను పోషించాలని ఆరాటపడుతున్నాడు. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. రాహుల్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
అయితే టీమిండియా ఆటగాళ్లు ఆదివారం నెట్ ప్రాక్టీస్‌కు విరామం ఇచ్చి కేవలం జిమ్‌లో కసరత్తులు చేశారు. అయితే రాహుల్ ప్రాక్టీస్‌కు విరామం ఇవ్వకుండా జిమ్‌లో కసరత్తులతో పాటు నెట్స్‌లో చెమటోడ్చాడు. దీంతో రాహుల్‌ను నెటిజన్లు తెగమెచ్చుకుంటున్నారు. కరణ్ షో వివాదం అనంతరం రాహుల్‌లో చాలా మార్పు వచ్చిందని పేర్కొంటున్నారు. కివీస్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో అవుటైన అనంతరం రాహుల్ చాలా అసహనంతో క్రీజు వదిలాడని ఇదివరకు అతడిని అలా చూడలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రపంచకప్‌లో టీమిండియా హీరో రాహుల్ అంటూ మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జూన్ 5న తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment